Studio18 News - TELANGANA / : రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పగటివేళ ముసురు వాన కురుస్తుండగా, రాత్రుళ్లు వాన దంచి కొడుతోంది. హైదరాబాద్ సహా తెలంగాణ మొత్తం తడిసిముద్దవుతోంది. ప్రాజెక్టులు నిండి కళకళలాడుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ భద్రాచలం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద 48 అడుగులు దాటింది.
Admin
Studio18 News