Studio18 News - తెలంగాణ / : ధరణి పోర్టల్‌కు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్ నిర్వహణను డిఫాల్ట్ అయిన సింగపూర్ కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీలో 'భూమి హక్కులు, సంస్కరణల'పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించిందన్నారు. తాము వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ప్రజలకు చెప్పామని గుర్తు చేశారు. ధరణిపై అనేక ఇబ్బందులు పడటం వల్లే ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడిస్తూ తీర్పు ఇచ్చారన్నారు. ఇందిరాగాంధీ హయాంలో దేశంలోని బడుగువర్గాలకు 40 కోట్ల ఎకరాలు పంచారని వెల్లడించారు. ధరణి విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీ వేశామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము 18 రాష్ట్రాల్లోని చట్టాలను అధ్యయనం చేశామన్నారు.
Admin
Studio18 News