Studio18 News - తెలంగాణ / : టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ కు ఊరట లభించింది. ఇటీవల నటి లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. లావణ్య తన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాంతో, తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణను హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ తరుణ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, అనేక ఏళ్లుగా తాము సహజీవనంలో ఉన్నామని, ఇటీవల హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడ్డాడని లావణ్య మీడియా ఎదుట వెల్లడించిన సంగతి తెలిసిందే.
Admin
Studio18 News