Tuesday, 23 July 2024 05:22:02 AM
# ఆ ఫాంహౌస్‌ని జేసీబీలతో కూల్చివేసిన మునిసిపల్ అధికారులు # ఆ సమయంలో ఆ ఉద్యోగి ఎందుకు వెళ్లాడు? మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం # ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించబోం.. పెద్దిరెడ్డిపై అనుమానాలు: మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని # Maddali Giri: వైసీపీకి రాజీనామా చేసిన మద్దాళి గిరి # Heavy Rains: మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు... భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక # Software- Autodriver: వీకెండ్స్‌లో ఆటో డ్రైవ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్ ఇంజనీర్.. సామాజిక సంబంధాల విలువను తెలియజేసే ఘటన ఇదీ! # Nagarjuna Yadav: డీజీపీ గారూ... గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా?: వర్ల రామయ్య # PR Sreejesh : 14 ఏళ్ల కెరీర్‌.. పారిస్ ఒలింపిక్స్‌తో ముగింపు.. టీమ్ఇండియా హాకీ స్టార్ పీఆర్ శ్రీజేశ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. # శాంతి నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవు- మంత్రి ఆనం హెచ్చరిక # Viral Video: నలుపు రంగు దుస్తులు వేసుకువచ్చి.. నల్లని పెయింట్ స్ప్రే చేసి వెళ్లిన యువకుడు # sixes ban : అల‌ర్ట్‌.. క్రికెట్‌లో కొత్త రూల్‌.. సిక్స్ కొడితే ఔట్‌.. బ్యాట‌ర్లకు అక్క‌డ క‌ష్ట‌కాల‌మే..! # Team India: కొత్త కోచ్ గంభీర్ తో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరిన టీమిండియా # Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు # Smita Sabharwal: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను మేం సమర్థించడం లేదు: హరీశ్ రావు # Operation Raavan : సినిమా మొదలయిన గంటలో విలన్‌ని కనిపెడితే సిల్వర్ కాయిన్ ఇస్తాము.. వెయ్యి మందికి బంపర్ ఆఫర్.. # Madanapalle: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మదనపల్లె చేరుకున్న డీజీపీ, సీఐడీ చీఫ్ # KTR: కొత్త న్యాయ చట్టాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ # Bihar: బీహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం # భయం.. భయం.. భయం.. అంటూ వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ # జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తన కేబినెట్లో మంత్రిగా ఎవరికి అవకాశం ఉంటుందో చెప్పిన రేవంత్ రెడ్డి

revanth reddy, telangana cabinet, brs

Date : 28 June 2024 07:17 PM Views : 49

Studio18 News - తెలంగాణ / : కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసిన వారికి మాత్రమే కేబినెట్లో అవకాశం ఉంటుందని స్పష్టీకరణ జులై 7న పీసీసీ చీఫ్‌గా పదవీ కాలం ముగియనుందన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో కరెంట్ కోతలు లేవు... అంతరాయాలు మాత్రమే ఉన్నాయన్న సీఎం రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడి

కాంగ్రెస్ పార్టీ బీఫాంపై పోటీ చేసిన వారికే కేబినెట్లో అవకాశం ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు రూ.7 లక్షల కోట్ల అప్పులు అయ్యాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్‌లో తాము రూల్స్‌‌ను బ్రేక్ చేయదల్చుకోలేదని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్‌గా తాను రెండు కీలక ఎన్నికలను పూర్తి చేశానన్నారు. రెండింట్లోనూ మంచి ఫలితాలను సాధించినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీకాలం జులై 7న పూర్తి కానుందన్నారు. పీసీసీ చీఫ్ పదవితో పాటు కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే నిర్ణయాలు ఒకేసారి ఫైనల్ అవుతాయన్నారు. తెలంగాణలో ఎలాంటి కరెంట్ కోతలు ఉండవని హామీ ఇచ్చారు. పంపిణీలో మాత్రం అంతరాయాలు ఉన్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత పథకంతో ఆర్టీసీ గాడిన పడిందన్నారు.

రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. పంటల రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. రేషన్ కార్డు... కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అన్నారు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పినట్లు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :