Saturday, 07 March 2026 08:14:57 PM
# సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం

KTR: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారంపై స్పందించిన కేటీఆర్

Date : 12 August 2024 04:29 PM Views : 422

Studio18 News - TELANGANA / : కోల్‌కతాలో జరిగిన జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతి తెలిపారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టకూడదన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మమత ప్రభుత్వం నేరస్తుడిని పట్టుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. హత్యాచారంపై బెంగాల్‌లో నిరసన తెలుపుతున్న వైద్యులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఆసుపత్రుల్లోనే డాక్టర్లు సురక్షితంగా ఉండలేకపోతే... ఇక ఆడపిల్లలు బయట క్షేమంగా ఉండగలరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 28 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేశారు. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ రాయ్‌కి ఇదివరకే నాలుగుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. అతని ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతనిని వదిలి వెళ్లారు. నాలుగో భార్య ఏడాది క్రితం చనిపోయింది. సంజయ్ రాయ్ పోలీస్ పౌర వాలంటీర్‌గా పని చేస్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :