Studio18 News - తెలంగాణ / : పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలని, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… మహిళ అని క్లయిమ్ చేస్తున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా? అని అన్నారు. పార్టీ మారి ఉండాల్సింది కాదు కదా? అని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. మరోవైపు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సభకు రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తున్నారని విమర్శించారు. ఎల్వోపీ హరీశ్ రావు లేదా కేటీఆర్‌కి ఎవరికి ఇచ్చినా బీఆర్ఎస్ ఆగం అవుతుందని చెప్పారు. హరీశ్ రావుకి ఇవ్వరని, కేటీఆర్‌కేమో అవగాహన లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకపోవడం వల్ల హౌస్ లో తమకు కిక్కు రావడం లేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ మీద చర్చలో కేసీఆర్ ఉంటే ఇంకా బాగా జరిగేదని తెలిపారు. కేసీఆర్ ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ తెలంగాణ జాతిపిత అనుకుంటున్నారని, ఆయన ఊహల్లో బతుకుతున్నారని వ్యాఖ్యానించారు.
Admin
Studio18 News