Monday, 15 December 2025 02:24:45 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చాం: హరీశ్ రావు

Date : 03 September 2024 04:53 PM Views : 452

Studio18 News - TELANGANA / : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రపురం సమీపంలో సాగర్ ఎడమ కాలువ వద్దకు వచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించామని, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వచ్చిందని వివరించారు. ఎడమ కాలువ తెగి పోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కేవలం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు. ఇసుక మేటలు వేసిన పొలాలకు ఎకరాకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కలిగిన నష్టంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరమూ కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. రైతులందరికీ న్యాయం చేసేందుకు తమ పోరాటమని అన్నారు. జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు సర్కారు ఏప్రిల్ నెలలో ఎక్కడికక్కడ మేకర్లకు సీల్ వేసి, లాక్ వేసిందని తెలిపారు. వాటిని మళ్లీ ఓపెన్ చేయలేదని, ఆ పాపం వల్లనే ఇప్పుడు రామచంద్రాపురం వద్ద ఎడమ కాల్వకు గండి పండిందని చెప్పారు. వేల ఎకరాలు మట్టి కొట్టుకుపోయాయని, రైతులకు తీరని దుఃఖం మిగిలిందని తెలిపారు. భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయిందని, సీఎం రేవంత్ రెడ్డి అనాలోచితంగా, అవగాహన రహితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తమపై ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :