Monday, 17 February 2025 04:38:57 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

ACB: తెలంగాణలో కటకటాల పాలైన మరో అవినీతి అధికారి .. రూ.కోట్ల నగదు, నగల స్వాధీనం

Date : 10 August 2024 11:44 AM Views : 48

Studio18 News - TELANGANA / : తెలంగాణలో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నివాసం నుంచి కోట్లాది రూపాయల నగదు, నగలు, స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థలో దాదాపు 25 సంవత్సరాలుగా సూపరింటెండెంట్‌గా, ఇన్‌చార్జి రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న నాగేంద్ర పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయనపై ఏడాది కాలంగా నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు వెళ్లి ఆయన ఆధ్వర్యంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వివరాలను తెలుసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న పక్కా సమాచారంతో శుక్రవారం నాలుగు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, నిర్మల్‌లలోని నరేందర్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోనూ సోదాలు జరిపారు. నిజామాబాద్‌లోని నరేందర్ నివాసంలో ఆరు కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదు, నగలను అధికారులు గుర్తించారు. వాటిలో రూ. 2.93 కోట్ల నగదు, రూ. ఆరు లక్షల విలువైన 51 తులాల బంగారు అభరణాలు, రూ.1.98 కోట్ల విలువ చేసే 17 స్థిరాస్తుల పత్రాలు, ఆయన భార్య, తల్లి పేరున బ్యాంక్ ఖాతాల్లో రూ.1.10 కోట్ల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. నాన్ గెజిటెడ్ అధికారి హోదాలో ఉండి ఇంత పెద్ద మొత్తంలో నగదు, నగలు, స్థిరాస్తులు ఉండటంతో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసు నమోదు చేసినట్టు నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. నరేందర్‌ను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. గతంలోనూ అవినీతి ఆరోపణలతో నరేందర్ సస్పెండ్ అయ్యారు. అసరా పింఛన్ల నగదును లబ్ధిదారులకు ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నారన్న అభియోగంపై ఆయన సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఆయనను బోధన్ మున్సిపాలిటీకి బదిలీ చేయగా, రాజకీయ నేతలు, అధికారులతో ఉన్న పరిచయాలతో బదిలీని రద్దు చేయించుకుని నిజామాబాద్ లోనే కొనసాగుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :