Saturday, 14 December 2024 03:37:02 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

రాహుల్ గాంధీ వస్తే నేనే రిసీవ్ చేసుకుంటా, సీఎం రేవంత్ స్వగ్రామానికి తీసుకెళ్తా- హరీశ్ రావు

Date : 29 August 2024 04:22 PM Views : 39

Studio18 News - తెలంగాణ / : Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి చేసేది చిట్ చాట్ కాదు.. చీట్ చాట్ అని మండిపడ్డారు. ఢిల్లీలో చిట్ చాట్ చేస్తూ ఓల్డ్ సిటీ విద్యుత్ బకాయిలను అదానీకి అప్పగిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మేము అడిగితే మేమెక్కడ అన్నామని అంటున్నారు. అబద్దాలు చెబుతూ గోబెల్స్ ను ప్రచారం చేస్తున్నారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు హరీశ్ రావు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గజదొంగ అని విరుచుకుపడ్డారు. 100 శాతం రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలే రుణమాఫీ జరగలేదని అంటున్నారని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారులపై పేపర్లు విసిరేశారని చెప్పారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారని హరీశ్ రావు వెల్లడించారు. ”ఆగస్టు 15లోగా ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు? నేను విసిరిన ఛాలెంజ్ అదే. 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి. ఢిల్లీలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్పాలి. నేను ఎయిర్ పోర్టుకు వెళ్లి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుని రుణమాఫీ అయిందో లేదో చెప్పడానికి సీఎం రేవంత్ సొంత గ్రామానికి తీసుకువెళ్తా. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లు 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు” అని హరీశ్ రావు అన్నారు. ”తెలంగాణ తల్లికి రూపం ఇచ్చింది కేసీఆర్. కేసీఆర్ ఆనవాళ్ళపై రేవంత్ రెడ్డి నిలబడ్డారు. సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం. వక్రబుద్ది ఉంటే అన్నీ వంకరగా కనిపిస్తాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా…? సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. కవిత బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచాయి. ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా…? ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతా” అని హరీశ్ రావు అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :