Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి పార్కింగ్ లో ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. అతివేగం కారణంగా పల్టీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు పార్కింగ్ లో ఉన్న ఓ కారు, మరో ఆటో తుక్కుతుక్కుగా మారాయి. శంషాబాద్ నుంచి ఓ కుటుంబం చిలకలగూడ వెళుతుండగా బంజారాహిల్స్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలు కాగా భార్య, భర్త ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక ఆ సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Admin
Studio18 News