Friday, 14 February 2025 07:35:43 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Ponnam Prabhakar: హైదరాబాద్‌కు రూ.10 వేల కోట్లిచ్చాం... కిషన్ రెడ్డి ఏం తెచ్చారో చెప్పాలి: పొన్నం ప్రభాకర్

Date : 27 July 2024 12:36 PM Views : 75

Studio18 News - TELANGANA / : హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర బడ్జెట్‍‌‌లో రూ.10 వేల కోట్లు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగర అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భాగ్యనగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారని, కానీ ఒక్క రూపాయి తీసుకురాలేదని మండిపడ్డారు. గతంలో స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్‌కు ఇచ్చారని, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ నిధులు తీసుకు రావాలన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని చెబుతుంటే బీజేపీ వాళ్ళు మా దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టకపోవడంతో మనకు నష్టం జరిగిందన్నారు. బీఆర్ఎస్ నేతలు నిన్న విహారయాత్రకు వెళ్లినట్లుగా కాళేశ్వరం వెళ్లారన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకవెళ్తామంటే తాము సిద్ధమన్నారు. హైదరాబాద్ నగరానికి కేంద్రం ఏం ఇస్తుందో చెప్పాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండానే గ్రామపంచాయతీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, అందుకు నిరసనగా నీతి అయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :