Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కుల్సుంపుర జియగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఉన్న ఫర్నిచర్ తయారీ గోదాంలో జరిగిందీ ఘటన. భవనం మూడో అంతస్తులో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపిక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. గోదాములో చిక్కుకున్న 20 మందిని రక్షించారు. వారిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News