Studio18 News - TELANGANA / : తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో నెమ్మదించిన హైడ్రా తాజాగా దూకుడు పెంచింది. ఆదివారం ఏకంగా 30 టీమ్ లతో ఐదు చోట్ల కూల్చివేతలు చేపట్టింది. పోలీస్ బందోబస్తు మధ్య, రెవెన్యూ, మునిసిపాలిటీ అధికారుల సమక్షంలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పాలంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ ను ప్రశ్నించారు. ఏ రోజు కూలుస్తారో సమయం చెప్పాలంటూ రేవంత్ రెడ్డిని, రంగనాథ్ ను నిలదీశారు. ఆ కాలేజీలు కూల్చేస్తే మీరే హీరో అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అలా కాకుండా వాటిని వదిలేస్తే మాత్రం హైడ్రా మిషన్ విఫలం అయినట్లేనని రాజాసింగ్ చెప్పారు.
Admin
Studio18 News