Saturday, 14 December 2024 03:34:42 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Deshapathi Srinivas: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం

Date : 15 August 2024 05:44 PM Views : 45

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటే... రేవంత్ రెడ్డి మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వలసవాద పుత్రుడని... తెలంగాణ సోయి ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. దేశ స్వాతంత్రానికి భరతమాత ప్రేరణ అయితే, తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ తల్లి ప్రేరణ అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రేవంత్ రెడ్డి రైఫిల్ పట్టుకొని బయలుదేరాడని గుర్తు చేశారు. ఆయన సీఎం అయ్యాక జై తెలంగాణ నినాదం మసకబారిపోయి... జై సోనియమ్మ, జై కాంగ్రెస్ నినాదాలు తీసుకువచ్చారని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రేవంత్ రెడ్డి తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తున్నారన్నారు. కాకతీయ తోరణం, చార్మినార్‌లను రాచరిక చిహ్నాలని గతంలో హేళన చేశారని మండిపడ్డారు. అంబేడ్కర్‌కు నివాళిగా తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టామన్నారు. రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ఏర్పడిందని, అందుకే గౌరవ సూచకంగా ఆయన పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. సచివాలయంలో ఉండాల్సింది వ్యక్తుల విగ్రహం కాదని... తెలంగాణ తల్లి విగ్రహమన్నారు. కానీ అధిష్ఠానం మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నారని ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ తల్లి విగ్రహం కావాలా? లేక రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కావాలా? తేల్చుకోవాలన్నారు. తెలంగాణ బిడ్డ నాటి సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారని విమర్శించారు. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధమో చెప్పాలన్నారు. అసలు కనీసం సోనియా గాంధీకి అయినా తెలంగాణతో సంబంధం ఉందా? అని నిలదీశారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే ముందు మేధావులతో చర్చలు జరిపారా? అని ప్రశ్నించారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహమే పెట్టాలని నిర్ణయించుకుంటే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :