Friday, 14 February 2025 07:30:35 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

TGRTC: స్టాప్‌లో బస్సు ఆపలేదని.. బీర్‌బాటిల్‌‌తో దాడిచేసి కండక్ట‌ర్‌పై పాము విసిరిన ప్రయాణికురాలు..

Date : 09 August 2024 12:31 PM Views : 49

Studio18 News - TELANGANA / : బస్సు ఆపలేదని హైదరాబాద్‌లో ఓ మహిళ కండక్టర్‌పై పాము విసిరింది. విద్యానగర్‌లో నిన్న జరిగిన ఈ ఘటన కాసేపు కలకలం రేపింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బస్సు ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యానగర్ బస్టాప్ దాటిన తర్వాత మూలపై నిల్చున్న మహిళ బస్సును ఆపాలని చెయ్యెత్తింది. కాస్త ముందుకు పోనిచ్చిన డ్రైవర్ రోడ్డు పక్కగా ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో బస్సు ఆపలేదన్న కోపంతో ఊగిపోయిన మహిళ బస్సు వెనక అద్దంపైకి బీర్ బాటిల్ విసిరింది. బస్సు ఆగిన వెంటనే కిందికి దిగిన మహిళా కండక్టర్ నిందితురాలిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే, అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితురాలు వెంటనే తన వద్దనున్న బ్యాగ్ తెరిచి అందులోంచి పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరింది. దీంతో భయపడిపోయిన కండక్టర్ పరుగులు తీసింది. పాము కిందపడి ఎటో వెళ్లిపోయింది. ఈ ఘటనతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ గొడవతో అక్కడ గుమికూడిన జనం ఈ ఘటనను వీడియో తీసుకుంటే, మరికొందరు పాము వెంట పరుగులు తీశారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు పామును ఎక్కడి నుంచి తెస్తోంది? ఎందుకు తెస్తోంది? అన్న దానిపై ఆమెను ప్రశ్నిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :