Studio18 News - తెలంగాణ / : రాష్ట్ర బడ్జెట్‌కు తెలంగాణ మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బడ్జెట్ పద్దును గవర్నర్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అందించనున్నారు. బడ్జెట్ పద్దును స్పీకర్, మండలి చైర్మన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్ర బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు భట్టివిక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Admin
Studio18 News