Monday, 08 December 2025 03:42:16 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Venkataramana Reddy: కనీసం బ్లాక్ టికెట్లు అమ్మే వారైనా మంచిగా మాట్లాడతారు.. మీరు అంతకంటే..: ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి

Date : 03 August 2024 05:25 PM Views : 307

Studio18 News - TELANGANA / : తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు. చాలీచాలని మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమే తప్ప కాంగ్రెస్ ఏం చేస్తుందనేది చెప్పడం లేదని తెలిపారు. శాసనసభలో సంస్కారవంతంగా మాట్లాడం లేదని, కనీసం బ్లాక్ టికెట్లు అమ్మే వారు అయినా మంచిగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా? ఇవ్వలేదా? ఈ విషయాన్నీ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పేషీ వద్ద 20 మందిని నియమించుకుంటున్నారని, పోయిన గెస్ట్‌ల కంటే అటెండర్లే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. అసెంబ్లీలో సీఎం, మంత్రులు చిన్నపిల్లలలాగా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారని వెంకట రమణా రెడ్డి చెప్పారు. రిటైరైన వారిని ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నారని గత ప్రభుత్వంపై అప్పట్లో విమర్శలు చేశారని, మరి ఇప్పుడు వారినే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. రిటైర్ అయిన వారిని నియమించుకుంటే వారికి వృత్తి పట్ల ఏం భయం ఉంటుందని వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై సభలో ఏం చర్చ జరిగిందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ విధ్వంసం, పునర్ నిర్మాణం అంటూనే సభలో చర్చించారని అన్నారు. ఏ జిల్లాలో వచ్చిన నిదులు ఆ జిల్లాలోనే ఖర్చు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :