Studio18 News - తెలంగాణ / : Khammam Flood : మున్నేరు వరద సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. మున్నేరు వరద ఉధృతి ఖమ్మంలో బీభత్సం చేసింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మున్నేరు వరద ఉధృతిలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇప్పుడిప్పుడే దానినుంచి తేరుకుంటున్న వదర బాధితులను మరోసారి మున్నేరు వరద భయాందోళకు గురిచేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరులో వరదనీరు పోటెత్తింది. దీంతో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు పునరావస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం మున్నేరు వద్ద నీటి ప్రవాహం 16 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా మున్నేరులోకి పెద్దెత్తున వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం మున్నేరు వద్ద నీటి ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు ముంపు ప్రాంతాల వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మున్నేరు వరద నేపథ్యంలో ఖమ్మం నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. బాదితులతో మాట్లాడారు. అనంతరం అధికారులతో మున్నేరు వరద పరిస్థితిపై సమీక్షించారు. ముందస్తు సహాయక చర్యలపైనా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అదేవిధంగా భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు ఇవాళ ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. మున్నేరులో వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండటంతోపాటు.. మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. అనుకోకుండా వచ్చిన మున్నేరు వరద ఉధృతికి స్వర్వం కోల్పోయామని, రెండురోజుల క్రితం వరద ఉధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుతున్నామని, ఈ సమయంలో మళ్లీ మున్నేరుకు వరద పోట్లెత్తడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Admin
Studio18 News