Tuesday, 03 December 2024 05:07:36 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Hyderabad CP : హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవి ఆనంద్

Date : 09 September 2024 11:21 AM Views : 43

Studio18 News - తెలంగాణ / : CV Anand : హైదరాబాద్ సీపీగా సీవి ఆనంద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండోసారి హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వినాయక చవితి, మిలాద్ ఉన్ నబి పండుగలు ఉన్నాయి.. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తామని చెప్పారు. గతేడాది కూడా రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి. అప్పుడు ప్రశాంతంగా జరిపాం. ప్రస్తుతం అన్ని రకాలుగా యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పండుగ ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పార్ట్ ఆఫ్ పోలీసింగ్ గా కొనసాగుతుంది. ప్రజలు తప్పుగా అపార్ధం చేసుకుంటున్నారని సీవీ ఆనంద్ అన్నారు. నగర వ్యాప్తంగా క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని, డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకుంటానని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సీవీ ఆనంద్ నగర సీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. సీవీ ఆనంద్‌ ఇంతకుముందు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 2021, డిసెంబర్ 24 నుంచి 2023 అక్టోబర్ 12 వరకు హైదరాబాద్ సీపీగా కొనసాగారు. అంతకుముందు ఆయన కేంద్ర సర్వీసుల్లో అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సేవలు అందించారు. 2017లో రాష్ట్రపతి పోలీసు పతకంతో పాటు ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డు కూడా అందుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :