Saturday, 14 December 2024 04:11:39 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

దేవుని సేవను ఆపడానికి కుట్ర చేసినోడు ఎవ్వడు మిగలడు : కేఏ పాల్

Date : 17 August 2024 04:04 PM Views : 42

Studio18 News - తెలంగాణ / : KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శనివారం సంగారెడ్డి కలెక్టర్ ని కలిశారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదాశివపేటలో 1200 ఎకరాల్లో సొంతంగా చారిటీ పెట్టి 53వేల మందికి ఉచితంగా అన్నం పెట్టాను. నా చారిటీని కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో రద్దు చేయించారు. ఇప్పుడు చారిటీలో 50ఎకరాల భూములను గుంజుకోవడానికి నా మనుషులపై దాడులు చేసి బెదిరిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డితోపాటు ఏడుగురిని పైకి పంపినట్టే నా భూమిని కబ్జా చేస్తున్న వారిని పైకి పంపుతా.. దేవుని సేవను ఆపడానికి కుట్ర చేసినోడు ఎవ్వడూ కూడా మిగలడు అంటూ కేఏ పాల్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు లో కేసు వేస్తానని కేఏ పాల్ అన్నారు. రేవంత్ రెడ్డి విదేశాల నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. నేను సీఎం రేవంత్ రెడ్డి కలిసి నెలకోసారి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెద్దామని చెప్పాను. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్లు నాతో మాట్లాడొద్దు అని చెబుతున్నారు. రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బెస్ట్ సీఎం అవుతారు.. లేకపోతే వరెస్ట్ సీఎం అవుతారని పాల్ అన్నారు. అక్టోబర్ 2న సమ్మిట్ పెట్టాలి. లేకపోతే ఏదో ఓ బటన్ నొక్కి అందరి సంగతి తేలుస్తా అంటూ పాల్ వ్యాఖ్యానించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :