Studio18 News - తెలంగాణ / : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియా చేరుకున్నారు. మెల్బోర్న్ నగరంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మెల్బోర్న్ లో ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) చలనచిత్రోత్సవానికి రామ్ చరణ్ గౌరవ అతిథిగా హాజరవుతున్నారు. ఐఎఫ్ఎఫ్ఎం 15వ ఎడిషన్ వేడుకలకు హాజరు కావాలంటూ ఇటీవల ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు రామ్ చరణ్ కు ఇటీవల ఆహ్వానం పంపారు. కాగా, ఈ చలనచిత్రోత్సవంలో రామ్ చరణ్ కు నిర్వాహకులు 'ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరల్ అంబాసిడర్' అనే బిరుదును కూడా ప్రదానం చేయనున్నారు.
Admin
Studio18 News