Thursday, 22 May 2025 04:14:26 PM
# నటి అనసూయ ఇంట్లో మరో వేడుక # 53 లక్షల చ.అ. విస్తీర్ణంతో సచివాలయం అవసరమా?: జగన్ # కారు వెనుక నక్కి సల్మాన్ ఖాన్ ఇంట్లోకి దూరే యత్నం.. వ్యక్తి అరెస్టు # రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే...! # ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు?

Telangana: తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు అతి తీవ్ర వర్ష సూచన

Date : 02 September 2024 12:59 PM Views : 154

Studio18 News - TELANGANA / : తెలంగాణను గత మూడు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాల్లో వరదలు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం నేటి (సోమవారం) వాతావరణంపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇవాళ కూడా రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర భారీ వర్షాల నుంచి అతి తీవ్రమైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ జాబితాలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు, ఆదిలాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని పేర్కొంది. భారీ నుంచి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయని తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల జాబితాలో కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జోగులాంబ-గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట ఉన్నాయని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, స్థిరంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :