Tuesday, 03 December 2024 05:39:10 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KTR: మన వద్ద రీకాల్ సిస్టం లేదు... నాలుగేళ్లు కాంగ్రెస్‌ను భరించాల్సిందే: కేటీఆర్

Date : 31 July 2024 01:10 PM Views : 48

Studio18 News - తెలంగాణ / : మన వద్ద రీకాల్ సిస్టం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు నాలుగేళ్ళు ఈ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనని... ప్రజలకు ఇక వేరే మార్గం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బడ్జెట్‌పై తమను ప్రతిపక్షం అభినందిస్తుందని భావించానని భట్టివిక్రమార్క అన్నారని... కానీ ఏం చూసి అభినందించాలో చెప్పాలన్నారు. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్‌లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో తొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్షా... అభిశంసించాలి. మన వద్ద రీకాల్ సిస్టం లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నాలుగేళ్లు భరించాల్సిందే అన్నారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా అన్నారు తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా? అని ఉద్యమం సమయంలో చాలామంది అన్నారని, పదేళ్ల క్రితం నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్రం చీకట్లతో నిండిపోతుందన్నారని గుర్తు చేశారు. పదేళ్లలో తెలంగాణ సంపద పెరిగిందని గతంలో చెప్పిన భట్టివిక్రమార్క, అధికారంలోకి వచ్చాక మాత్రం మాట మారుస్తున్నారన్నారు. రెవెన్యూ మిగులుపై కేటీఆర్ లెక్కలు 2014లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.369 కోట్ల మిగులుతో తమకు రాష్ట్రాన్ని అప్పగించిందన్నారు. నాడు రెవెన్యూ మిగులు అదే అన్నారు. కానీ 2022-23 నాటికి రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లుగా ఉందన్నారు. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు రూ.209 కోట్లు అన్నారు. రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ విమర్శిస్తోందని, కానీ ఆరోజు మిగులు ఎంతో చూడాలన్నారు. వేతనాలు తెచ్చేందుకు అప్పులు తెచ్చామని చెప్పిన ఆర్థికమంత్రి... బడ్జెట్‌లో మాత్రం మిగలు ఉందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణలోని 33 జిల్లాలు ముందున్నాయన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :