Monday, 17 February 2025 04:15:03 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఆనంద్ మహీంద్రా: సీఎం రేవంత్ రెడ్డి

Date : 05 August 2024 02:58 PM Views : 58

Studio18 News - TELANGANA / : CM Revanth Reddy: తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. అమెరికా పర్యటనలో న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీపీపీ మోడల్ లో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికి చైర్‌ప‌ర్స‌న్‌గా ఉండాలని ఆనంద్ మహీంద్రాను తాను రిక్వెస్ట్ చేశానని, రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. ప్రపంచంలో నైపుణ్యానికి చాలా డిమాండ్ ఉందని, అందుకే తెలంగాణలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో ఐటీ, వైద్య, క్రీడా రంగాలతో పాటు పలు అంశలపై శిక్షణనిస్తామని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఎన్నారైలు సహకరించాలని ఆయన కోరారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీయిచ్చారు. హైదరాబాద్ లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని.. ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్ విమర్శించారు. ఎన్నారైల సహకారంతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చిందని తెలిపారు. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగాయని.. బీఆర్ఎస్ చర్చల్లో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా అంతకుముందు న్యూజెర్సీలో కాంగ్రెస్ అభిమానులు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :