Friday, 14 February 2025 06:38:48 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Vemula Prashanth Reddy: అదే విషయం అక్బరుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారు: వేముల ప్రశాంత్ రెడ్డి

Date : 03 August 2024 04:36 PM Views : 109

Studio18 News - TELANGANA / : రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని, నియంతృత్వ పాలన అని... ఇంత అధ్వానంగా సభ ఎప్పుడూ జరగలేదని మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం నాడు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... శాసనసభలో తమ పార్టీ గొంతు నొక్కారన్నారు. జీరో అవర్ మొత్తం ఎత్తేశారని... ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని విమర్శించారు. సభలో చర్చలకు అవకాశం ఇవ్వడం లేదని, ప్రజాసమస్యలపై మాట్లాడుదామంటే మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రశ్నిస్తే మార్షల్స్‌తో బయటకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను, బీఆర్ఎస్‌ను తిట్టేందుకే అసెంబ్లీని వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి వికృతరూపం బయటపడిందన్నారు. కాంగ్రెస్‌ మిత్రపక్షమని చెబుతున్న మజ్లిస్ పార్టీ కూడా అధికార పార్టీ తీరును తప్పుబట్టిందన్నారు. రేవంత్ రెడ్డి సభానాయకుడిగా కాకుండా అటవిక రాజులా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇష్టారాజ్యంగా సభను తప్పుదోవ పట్టించారన్నారు. కేసీఆర్‌ను తిట్టడం... గత ప్రభుత్వంపై ఆరోపణలతోనే సభ నడించిందన్నారు. అసెంబ్లీని కౌరవ సభలా నడిపించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కళ్లున్న కబోధి అన్నారు. హామీలను అమలు చేయడమే లక్ష్యంగా తాము మాట్లాడామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలు, 420 హామీల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించడం దారుణమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం అబద్దాలు చెప్పారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చెప్పారని... కానీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారు? అని ప్రశ్నించారు. అబద్దాల్లో రేవంత్ రెడ్డిని గిన్నిస్ రికార్డ్‌లోకి ఎక్కించాలని ఎద్దేవా చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :