Tuesday, 03 December 2024 04:11:52 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థిని హోటల్ రూములో నిర్బంధించి 20 రోజులుగా అఘాయిత్యం

Date : 09 September 2024 02:49 PM Views : 45

Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని భైంసాకు చెందిన బాధిత విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు బెదిరించి హైదరాబాద్ పిలిపించుకున్నాడు. అక్కడికెళ్లాక నారాయణగూడలోని ఓ హోటల్ రూముకు తీసుకెళ్లి అందులో నిర్బంధించాడు. 20 రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో కంగారుపడిన వారు వెంటనే హైదరాబాద్ చేరుకుని షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. బాధితురాలు వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నారాయణగూడలోని ఓ హోటల్‌లో బాధిత విద్యార్థిని ఉన్నట్టు గుర్తించి రక్షించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరో ఘటనలో క్లాస్‌మేట్స్ వేధింపులు హైదరాబాద్‌లోనే జరిగిన మరో ఘటనలో కలినరీ అకాడమీలో చదువుతున్న విద్యార్థిని ఆమె సహచర విద్యార్థులే లైంగికంగా వేధించసాగారు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అందుకున్న షీ టీమ్స్ రంగంలోకి దిగి ఆమెను రక్షించాయి. కొందరు యువకులు తనను లైంగికంగా వేధిస్తున్నారని, అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :