Studio18 News - తెలంగాణ / : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిన్న జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసిన బండ్ల తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో కృష్ణమోహన్‌రెడ్డి బుధవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లడంతో ఆయన తిరిగి సొంత గూటికి వెళ్తున్నారన్న ప్రచారం జరిగింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలోనూ కలవరం రేపింది. పార్టీలో బండ్లకు సముచిత స్థానం కల్పించకపోవడం వల్లే ఆయన పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. ఈ నేపథ్యంలో నిన్న రేవంత్‌రెడ్డిని కలిసి బండ్ల కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
Admin
Studio18 News