Studio18 News - తెలంగాణ / : అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. వారు ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారిద్దరు గత కొన్నాళ్లుగా అక్కడే ఉండిపోయారు. వారు క్షేమంగా తిరిగి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్పేస్‌లో చిక్కుకున్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ఆ ఇద్దరినీ వెనక్కి తీసుకురావడం.. నాసాకు ఒక పెను సవాల్ అని అభిప్రాయపడ్డారు. స్టార్ లైనర్ సాంకేతిక సమస్యను త్వరగా పరిష్కరించి, వారిని తీసుకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 8 రోజుల మిషన్‌కు వెళ్లారు. స్టార్ లైనర్‌లో సమస్య తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం ఖరారు కాలేదు. వచ్చే ఫిబ్రవరిలో వారు వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాములను తీసుకువచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది.
Admin
Studio18 News