Studio18 News - తెలంగాణ / : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖిత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రానికి పేరు తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా క్రీడా రంగానికి చెందిన వివిధ సవరణ బిల్లులను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు మద్దతు తెలిపాల్సిందిగా భట్టి విక్రమార్క ప్రతిపక్షాలను కోరారు. ఇక సభ ప్రారంభం కాగానే మంత్రి శ్రీధర్ బాబు సివిల్ కోర్టుల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును వెంటనే తెలంగాణ శాసనసభ ఆమోదించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం బిల్లు సభ ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
Admin
Studio18 News