Saturday, 14 December 2024 03:59:58 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Telangana: సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ పోస్ట్... కేటీఆర్, హరీశ్ రావులకు కాంగ్రెస్ వార్నింగ్

Date : 05 September 2024 04:12 PM Views : 39

Studio18 News - తెలంగాణ / : కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి ఏం పీకాడని మేమూ అడగగలమని, కానీ తమకు సంస్కారం అడ్డు వస్తోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కేటీఆర్, హరీశ్ రావు తమ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోవాలని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించింది. ఈ మేరకు 'తెలంగాణ కాంగ్రెస్' ఎక్స్ హ్యాండిల్ వేదికగా ట్వీట్ చేసింది. "అన్నీ మేమే చేస్తే నువ్వు ఏం పీకుతావ్ రేవంతూ⁉" అని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది. దీనిని ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని నిలదీసింది. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకాడని మేమూ అనగలమని పేర్కొంది. "కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు మీ సోషల్ మీడియాను అదుపులో ఉంచుకోండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకాడు!? అధికారం ఉన్నపుడు పీకింది ఏం లేదు, కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్ పెద్దగా పీకేదేం లేదు! అని మేము కూడా అనగలం" అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ తమకు సంస్కారం అడ్డు వస్తుందని, తమ పార్టీ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేస్తోందని పేర్కొంది. మీరు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వెనుక మీ పార్టీ విధానాలు, మీ నాయకత్వం, మీ ఆలోచనలు ఎలాంటివో అర్థమవుతున్నాయని ఎద్దేవా చేసింది. ఒక పార్టీ అధికారిక ఖాతాలో రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించకోవాలని డిమాండ్ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :