Studio18 News - తెలంగాణ / : జీడిమెట్ల పోలిస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో ఇటీవల కాల్పులు కలకలం రేపాయి. నిందితులను పట్టుకున్న పోలీసులు మీడియా ముందు వారిని ప్రవేశ పెట్టారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 27న అర్ధరాత్రి గాజుల రామారం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో నరేశ్ ఆదేశాలతో అతడి అనుచరుడు శివ కాల్పులు జరిపాడని వివరించారు. నరేశ్‌తో పాటు మరో 14 మంది నిందితులను పట్టుకున్నామని అన్నారు. వారి వద్ద నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నరేశ్‌పై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో 4, సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో 1 కేసు ఉన్నాయని, ఇంకా కొద్దిగా నేర చరిత్ర ఉందని చెప్పారు. పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో అతడు సూత్రధారిగా ఉండి, భయబ్రాంతులకు గురి చేశాడని మరి కొందరు బాదితుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. గాజుల రమారం దగ్గర జరిగిన ఆ ఘటనలో 2 రౌండ్లు కాల్పులు జరిపారని అన్నారు. అతడికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా నెల రోజుల క్రితం బిహార్ నుంచి దొంగతనంగా తుపాకీతో పాటు 100 బుల్లెట్లు కొనుగోలు చేసినట్లు తేలిందని చెప్పారు. అతడిపై రౌడీ షీట్‌తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అన్నారు.
Admin
Studio18 News