Studio18 News - TELANGANA / : నాగర్ కర్నూల్ మండలం, వనపట్ల గ్రామంలో ఇటివల కురిసిన వర్షాలతో మిద్దె కూలి మరణించిన కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని బిఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామాన్ని బిఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకు వనపట్ల గ్రామంలో ఇల్లు కూలి ఓకె కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించడం బాధాకరం అన్నారు. పేదరికం వల్ల సమాజంలోని వ్యక్తులు అకాల మరణం చెందడం శోచనీయం అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న పాలక ప్రభుత్వాలు పేదరికాన్ని రూపుమాపక పోవడం దుర్మార్గం అనీ విమర్శించారు. మట్టి మిద్దెల్లో ఉన్న పేద కుటుంబాలకు గ్రామాల్లో ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
Admin
Studio18 News