Saturday, 14 December 2024 06:22:56 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

traffic challan: తెలంగాణలో ఇక నేరుగా మొబైల్ ఫోన్లకే ట్రాఫిక్ చలాన్లు!

Date : 31 August 2024 02:48 PM Views : 73

Studio18 News - తెలంగాణ / : వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఇప్పటి వరకూ ఆ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చలనా (జరిమానా) వేస్తున్నారు. అయితే వాహనదారులు చెక్ చేసుకుంటేనో..లేక ఎక్కడైనా వాహనాల తనిఖీ సమయంలో పోలీసులు నిలుపుదల చేసిన సమయంలోనో ఎన్ని చలాన్లు పెండింగ్ లో ఉన్నాయో.. ఎంత చెల్లించాలో తెలిసేది. తమ వాహనంపై ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలియకపోవడంతో వాహనదారులు వాటిని చెల్లించడం లేదు. దీంతో చలాన్ల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ చలానాల చెల్లింపులకు కొత్త ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన సందర్భంలో నేరుగా వాహనదారుడి మొబైల్ నెంబర్ కు ట్రాఫిక్ చలాన్ లు పంపించడంతో పాటు వాటి సులభతర చెల్లింపులకు కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ యాప్, యూపీఐ అప్షన్స్ కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారట. వాహనదారుల చలానా జరిమానాలు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో ఈ కొత్త వ్యవస్థను తీసుకువస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. అయితే ఈ వ్యవస్థను ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని రవాణా శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులకు నేరుగా వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో చలానా పంపే విధానం తీసుకువస్తే వాహనదారులకు చెల్లింపులు సులభతరం అవుతాయని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :