Saturday, 14 December 2024 03:22:23 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, వెంటాడతాం: కేటీఆర్ వార్నింగ్

Date : 21 August 2024 02:47 PM Views : 39

Studio18 News - తెలంగాణ / : KTR on Crop Loan Waiver: రైతులకు ఎప్పటి లోపల పూర్తిగా రుణమాఫీ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా అన్నదాతలకు రుణమాఫీ చేయాలన్నారు. రైతు రుణమాఫీపై మంత్రులు ఒక్కొలా మాట్లాడుతున్నారని, రూ. 2 లక్షల రుణమాఫీ పెద్ద అబద్దమని వ్యాఖ్యానించారు. రుణమాఫీపై రేపటి నుంచి ఆందోళనలు చేపడతామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు ప్రభుత్వం టోపీ పెట్టిందని, సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ లోనే చాలా రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. కోస్గి మండలంలో20 వేలకు పైగా రైతులు రుణం తీసుకుంటే 8,527 మందికి రుణమాఫీ జరిగిందని వెల్లడించారు. కొత్త ఆంక్షలతో రుణమాఫీకి సర్కారు కొర్రీలు పెడుతోందని, ఇది పచ్చిమోసగాళ్ల ప్రభుత్వమని మండిపడ్డారు. రుణమాఫీకి మాదిరిగానే రైతుబంధును చేస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు. రుణమాఫీ అందక రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని, అన్నదాతల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. 70 లక్షల మంది రైతులను సీఎం వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని, రుణమాఫీ జరిగేవరకు వెంటాడతామని హెచ్చరించారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఛీటింగ్‌పై మా ఫైటింగ్ ఆగదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :