Saturday, 14 December 2024 06:45:47 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

AV Ranganath: హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌కు మ‌రో కీల‌క బాధ్య‌త‌!

Date : 03 September 2024 12:00 PM Views : 38

Studio18 News - తెలంగాణ / : ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ)ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంస్థ‌కు క‌మిష‌న‌ర్‌గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు మ‌రో కీల‌క బాధ్య‌త‌ను అప్ప‌గించే యోచ‌న‌లో తెలంగాణ స‌ర్కార్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా రంగ‌నాథ్‌ను నియ‌మిస్తార‌ని స‌మాచారం. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు ఈ బాధ్య‌త‌ల‌ను హెచ్ఎండీఏ క‌మిష‌నర్ నిర్వ‌హిస్తున్నారు. హెచ్ఎండీఏలోని ఏడు జిల్లాల ప‌రిధిలో చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌ను కూడా హైడ్రా కింద‌కు తేవ‌డం ద్వారా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా చూడొచ్చు అనేది ప్ర‌భుత్వం ఆలోచ‌న‌. ఇందులో భాగంగా హైడ్రాతో పాటు చెరువుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ బాధ్య‌త‌ల‌ను కూడా రంగ‌నాథ్‌కే అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌ట‌న వెలువడే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు హెచ్ఎండీఏ ప‌రిధిలో ఉన్న ఏడు జిల్లాల్లోని చెరువుల స‌ర్వే, ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌, నోటిఫికేష‌న్ వెంట‌నే పూర్తి చేయాల‌ని క‌మిష‌న‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ఆదేశించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :