Saturday, 14 December 2024 02:58:42 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

MLC Kavitha : ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు కవిత.. స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు

Date : 28 August 2024 11:37 AM Views : 42

Studio18 News - తెలంగాణ / : BRS MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తీహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి 9గంటల సమయంలో విడుదలయ్యారు. జైలు నుంచి కవిత బయటకు రాగానే కొడుకు, భర్తను హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం సోదరుడు కేటీఆర్, హరీశ్ రావును అలింగనం చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. కవిత జైలు నుంచి బయటకురాగానే అప్పటికే భారీ సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అక్కడకు చేరుకొని ‘కవిత.. డాటర్ ఆఫ్ ఫైటర్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి నేరుగా ఢిల్లీ వసంత విహార్ లోని తెలంగాణ భవన్ కు కవిత వెళ్లారు. తెలంగాణ భవన్ లో ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ లో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కవిత సమావేశం అయ్యారు. స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కష్టకాలంలో అండగా ఉన్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు జైలు వద్ద కవిత మాట్లాడుతూ.. తనను ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జైలుకు పంపారని అన్నారు. రాజకీయ కక్షతోనే నన్ను జైల్లో పెట్టారు. ఇబ్బందేమీ లేదు. తప్పకుండా మేం పోరాటంచేస్తాం. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను. నేను కేసీఆర్ బిడ్డను. కేసీఆర్ బిడ్డగా నేను తప్పుచేసే ప్రసక్తే లేదు. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పనిచేస్తం. న్యాయంకోసం పోరాటం చేస్తాం. రాజకీయంగా యుద్ధమే చేస్తమని కవిత అన్నారు. ఇవాళ హైదరాబాద్ కు కవిత.. ఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం కవిత హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానంలో బయల్దేరతారు. సాయంత్రం 5గంటల వరకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కవిత రాక సందర్భంగా అభిమానులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :