Sunday, 08 March 2026 03:23:22 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

jitender Reddy: డిసెంబర్ లోపు తెలంగాణలో నూతన క్రీడా పాలసీ

Date : 22 August 2024 02:32 PM Views : 404

Studio18 News - TELANGANA / : డిసెంబర్ లోపు నూతన క్రీడా పాలసీ రూపకల్పన పూర్తి చేస్తామని ముసాయిదా క్రీడా పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్, తెలంగాణ క్రీడా శాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి అన్నారు. క్రీడా పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ఇటీవల ప్రభుత్వం నియమించింది. శాట్జ్ చైర్మన్ శివసేనారెడ్డి సహా 11 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉండగా, బుధవారం జితేందర్ రెడ్డి అధ్యక్షతన ముసాయిదా క్రీడా పాలసీపై సమీక్ష నిర్వహించారు. కమిటీ తొలి సమావేశానికి క్రీడా శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్, శాట్జ్ వీసీ ఎండీ సోనీబాలాదేవి, ఒలింపిక్ సంఘం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ హాజరయ్యారు. క్రీడాకారుల సంక్షేమం, కొత్త కోచ్ ల నియామకం, క్రీడా రంగం అభివృద్ధికి దశాదిశను నిర్దేశించేలా నూతన క్రీడా పాలసీ రూపొందిస్తామని శివసేనా రెడ్డి తెలిపారు. ఈ నెల 30న మరో మారు క్రీడా రంగ నిపుణులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. శాట్జ్ కొత్త లోగోను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారని శివసేనా రెడ్డి తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :