Studio18 News - తెలంగాణ / : Bangladesh crisis : బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు నిఘాను పెంచారు. నగరంలో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచారు. ఎవరైనా అక్రమంగావస్తే చర్యలు తీసుకుంటాని పోలీసులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని అన్నారు. బాలాపూర్ ప్రాంతం పరిధిలో 5000 మందికిపైగా రోహింగ్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వారికి గుర్తింపు కార్డులు వచ్చాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇతర దేశాల నుండి వచ్చే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న రోహింగ్యాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటందని సీపీ సుదీర్ బాబు చెప్పారు.
Admin
Studio18 News