Monday, 15 December 2025 01:31:39 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

Bhadradri Kothagudem District: ఇది దైవ ద్రోహం.. 'శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ' కార్యకలాపాలపై భద్రాచలం ఆలయ ఈవో ఆగ్రహం

Date : 16 September 2024 02:01 PM Views : 392

Studio18 News - TELANGANA / : భద్రాచల రాముడి పేరిట పేటెంట్ హక్కు తీసుకోవడానికి దేవాదాయ శాఖ ద్వారా దరఖాస్తు చేశామని భద్రాచలం రామాలయ ఈవో రమాదేవి తెలిపారు. 'శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ' ఆధ్వర్యంలో రేపు భద్రాచలంలో ఓప్రైవేటు సత్రంలో శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రికను ముద్రించిన నేపథ్యంలో ఈవో స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పేరుతో అనుమతులు లేకుండా ఎలాంటి కల్యాణాలు, హోమాలు, జపాలు చేయకూడదన్నారు. అలాంటి వారు దేవుడి పేరు, వెబ్ సైట్ చిరునామా, స్వామివార్ల చిత్రాలను ఉపయోగించడం నేరమని ఈవో తెలిపారు. శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో రామాలయాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు ఖగోళయాత్ర నిర్వహించారని తెలిపారు. అయితే ఈ నెల 17న భద్రాచలంలో శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారని, ఇది చూసి తాము ఆశ్చర్యపోయామన్నారు. భద్రాద్రి రామాలయం తరఫున ఖగోళయాత్ర చేస్తున్నట్లుగా అందులో ఉందన్నారు. ఈ పేరుతో విరాళాలు సేకరించారన్నారు. ఇది దైవద్రోహం కిందకు వస్తుందని, దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్‌కు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తిగత సెలవులు తీసుకున్న భద్రాచల రామాలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, అర్చకుడు సీతారాం ఖగోళయాత్రలో పాల్గొన్నారని పేర్కొన్నారు. భద్రాచల ఆలయం పేరుతో కల్యాణాలు చేస్తున్న విషయాన్ని వారు కూడా తమ దృష్టికి తీసుకు రాలేదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :