Studio18 News - తెలంగాణ / : Bandi Sanjay Kumar : కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బ్యాంకుల నుంచి రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయిన రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. సోనియాగాంధీ బర్త్ డే రోజున కూడా మోసం చేశారు. ప్రజలను కాంగ్రెస్ పార్టీ అయోమయంకు గురిచేస్తుందని అన్నారు. రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్లమీదకు వస్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాడతామని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. విలీనాలు వద్దు దండం పెడతా. బీఆర్ఎస్ పార్టీని చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. బీఆర్ఎస్ ను కలుపుకుంటే మా ప్రభుత్వం ఏమైనా వస్తుందా అని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లకు మాత్రమే ఆ అవసరం ఉంది… నెక్ట్స్ సీఎం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పక్కాగా కలుస్తాయి. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో ఎందుకు వెయ్యలేదు..? కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, భూ స్కామ్ అన్ని అటకెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇక చేరికలు మాత్రమే ఉన్నాయని సంజయ్ అన్నారు.
Admin
Studio18 News