Studio18 News - తెలంగాణ / : ఎన్డీయే 3.0 ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపుల పట్ల మీ అంచనాలు ఏమిటి? అని ఈ ఉదయం ఓ జర్నలిస్టు తనను అడిగాడని కేటీఆర్ వెల్లడించారు. అయితే "గత పదేళ్లుగా తెలంగాణకు ఏమిస్తున్నారో, ఈసారి కూడా అదే ఇస్తారు... పెద్ద గుండు సున్నా" అని ఆ జర్నలిస్టుకు బదులిచ్చానని వివరించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
Admin
Studio18 News