Studio18 News - తెలంగాణ / : తెలంగాణలో ఏమాత్రం సంస్కారం లేనిది కేసీఆర్ కుటుంబమేనని కాంగ్రెస్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణి విమర్శించారు. ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంస్కారహీనుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సంస్కారం కావాలంటే గాంధీ భవన్‌కు రావాలని... నేర్పిస్తామని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉందని, కానీ కేసీఆర్ పదేళ్ల కాలంలో అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆ కారణంతోనే మహిళల పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీలోనే గౌరవం దక్కుతుందన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తమదే అన్నారు.
Admin
Studio18 News