Studio18 News - తెలంగాణ / : Bala Latha : వికలాంగులపై సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది ప్రభుత్వం ఆలోచనా.. లేక ఆవిడ మాటలా అని సివిల్స్ ఎగ్జామ్ కోచ్ బాల లత ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వికలాంగులు ఉండాలా.. వద్దా చెప్పండి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారు. స్మిత వ్యాఖలకి సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్ష నేత కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలని అన్నారు. మా మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నాతో వేలమంది విద్యార్థులు చర్చించారు. ఈ విషయాన్ని కచ్చితంగా ఖండించాలి. స్మిత సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలి.. మాకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేశారు. స్మిత సబర్వాల్ జస్ట్ ఒక ఐఏఎస్. 24 గంటలు అయింది ఆమె ఈ వ్యాఖ్యలు గురించి మాట్లాడి. ఇప్పటికీ వ్యాఖలను ఆమె వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పలేదు. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్.. ఇద్దరికీ (నాకు, స్మితకి) సివిల్స్ ఎగ్జామ్స్ పెట్టండి.. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో చూద్దాం అంటూ బాల లత అన్నారు. స్మితా సబర్వాల్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి కింద నిబంధనల ఉలంఘనకు పాల్పడ్డారు. రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను ఈమె వ్యతిరేకిస్తున్నారా? ప్రీమియర్ సర్వీసెస్ అనగా ఈమె ఉద్దేశ్యంలో ఏమిటి? ప్రజాసేవకులా, ప్రజల మీద పెత్తనం చేయువారా అంటూ బాల లత ప్రశ్నించారు.దివ్యాంగులు ఎక్కువ సేపు పనిచేయలేరని, వారి సమర్థతను నిర్ణయించడానికి, శంఖించడానికి స్మిత సబర్వాల్ కు గల శాస్త్రీయ ప్రాతిపదికలు ఏమిటని లత ప్రశ్నించారు. దివ్యాంగుల పట్ల సానుభూతి లేని స్మిత వాఖ్యలను దివ్యాంగ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని లత డిమాండ్ చేశారు. సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ దివ్యాంగుడు కాదు. వెరిఫై చేసిన డాక్టర్లు దివ్యాంగులు కారు. ఉద్యోంగ ఇచ్చిన అథారిటీ దివ్యాంగులు కాదు. అటువంటప్పుడు దివ్యాంగులను ఏ విధంగా కించపరిచినట్లు ప్రవర్తిస్తారు. సమాజం మొత్తం దీని గురించి ఆలోచించాలని లత అన్నారు.
Admin
Studio18 News