Studio18 News - తెలంగాణ / : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా పడింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ తదితర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, వారిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పలు కోర్టుల తీర్పులను వారు చదివి వినిపించారు. అనంతరం తదుపరి విచారణను వాయదా వేసింది.
Admin
Studio18 News