Saturday, 14 December 2024 06:09:16 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KTR: రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ: కేటీఆర్

Date : 26 August 2024 11:41 AM Views : 76

Studio18 News - తెలంగాణ / : రైతు రుణమాఫీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అన్నివిధాలా అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడని మండిపడ్డారు. రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేదని, జూన్‌లో వేయాల్సిన రైతుభరోసా డబ్బులు ఆగస్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వెయ్యలేదని విమర్శలు గుప్పించారు. ఇక కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలేదని కేటీఆర్ ప్రస్తావించారు. రైతు కూలీలకు రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలేదని, కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారంటూ ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ షేర్ చేశారు. డెంగ్యూ మరణాల లెక్కలపైనా విమర్శలు.. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని ప్రభుత్వం తెలిపిందని, కానీ వార్తాపత్రికలు ముందు రోజు 5, ఇవాళ (సోమవారం) 3 మరణాలను రిపోర్ట్ చేశాయని కేటీఆర్ విమర్శించారు. డేటాను ఎవరు దాచారు, ఎందుకు దాచారని ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో సరిపడా మందులు లేవని, చాలా ఆసుపత్రుల్లో ముగ్గురు నలుగురు రోగులు ఒకే బెడ్‌ను షేర్ చేసుకుంటున్నారని ఆరోపించారు. తీవ్రమైన సమస్య ఉందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఒప్పుకొని, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. పలు పత్రికల పేపర్ క్లిప్పింగ్స్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ షేర్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :