Studio18 News - తెలంగాణ / : Bhatti Vikramarka : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి దశాబ్దకాలంలో ఆశించిన స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లిందని, అభివృద్ధి అడుగంటిందని అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని బీఆర్ఎస్ పాలనపై భట్టి విమర్శలు గుప్పించారు.తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ. 2,91,159 కోట్లు. మూలధన వ్యయం రూ. 33,487 కోట్లు కాగా భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు కాగా.. పన్నేతర ఆదాయం రూ. 35,208.44 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా 26,216.28 కోట్లు. కేంద్రం గ్రాంట్లు రూ. 21,636.15 కోట్లుగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో.. వ్యవసాయం ,అనుబంధ రంగాలకు : 72,659 కోట్లు హార్టికల్చర్ : రూ. 737 కోట్లు పశుసంవర్ధక శాఖ రూ. 19,080కోట్లు మహాలక్ష్మి ఉచిత రవాణా రూ. 723కోట్లు గృహజ్యోతి పథకం రూ. 2,418 కోట్లు ప్రజాపంపిణీ వ్యవస్థ : రూ. 3,836 కోట్లు పంచాయతీ రాజ్ : రూ. 29816 కోట్లు మహిళా శక్తి క్యాంటిన్ : రూ. 50కోట్లు హైదరాబాద్ అభివృద్ధి : రూ. 10,000కోట్లు జీహెఎంసీ : రూ. 3000 కోట్లు హెచ్ ఎండీఏ : రూ.500 కోట్లు మెట్రో వాటర్ : రూ. 3385 కోట్లు హైడ్రా సంస్థకు : రూ.200 కోట్లు ఏయిర్ పోర్టుకు మెట్రో : రూ.100కోట్లు ఓఆర్ ఆర్ : రూ.200కోట్లు హైదరాబాద్ మెట్రో : రూ.500కోట్లు ఓల్డ్ సిటీ మెట్రో : రూ. 500కోట్లు మూసీ అభివృద్ధి : రూ.1500కోట్లు రీజినల్ రింగ్ రోడ్డు : రూ.1500కోట్లు స్ర్తీ ,శాశు సంక్షేమ శాఖ : రూ.2736 కోట్లు ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం : రూ.17000 కోట్లు మైనారిటీ సంక్షేమం : రూ.3000 కోట్లు బీసీ సంక్షేమం : రూ.9200 కోట్లు వైద్య ఆరోగ్యం : రూ.11468 కోట్లు విద్యుత్ శాఖ : రూ.16410 కోట్లు అడవులు, పర్యావరణం : రూ.1064 కోట్లు ఐటీ శాఖకు : రూ. 774కోట్లు నీటి పారుదల శాఖకు : రూ.22301 కోట్లు విద్యాశాఖకు : రూ. 21292 కోట్లు హోంశాఖ : రూ. 9564 కోట్లు ఆర్ అండ్ బి శాఖకు : రూ. 5790 కోట్లు రీజినల్ రింగ్ రోడ్డు రూ. 1525 కోట్లు
Admin
Studio18 News