Studio18 News - TELANGANA / : మంచిర్యాల పట్టణంలోని గోదావరి ప్రాంగణంలో ఉన్న మాత శిశు ఆసుపత్రిని ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమీక్షించి , ఆసుపత్రికి వచ్చిన రోగులు , బాలింతల తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు..రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడటంతో రోగులు, గర్భిణులు, బాలింతలు, శిశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఈ క్రమంలో వర్షానికి వరద నీరు ఆసుపత్రిలో చేరాయని పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తో సమాచారం తెలుసుకున్న ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు స్పందించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆసుపత్రిలో వార్డులలో తిరిగి పలువురు రోగులతో సమస్యలపై అర తీశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ .. రెండు రోజుల క్రితం కరెంట్ కేబుల్ సాంకేతిక కారణాల వల్ల కాలిపోవడంతో మరొక కేబుల్ ను అమర్చే సమయంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడిందని తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేసి అధికారులు విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారని అంతరాయం సమయంలో బాలింతలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనని ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు తెలిపారు .. జనరేటర్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం తో ఈ సమస్య తలెత్తి శిశువులు బాలింతలు అసౌకర్యానికి గురయ్యారని అన్నారు. అధికారులతో చర్చించి జనరేటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.. మాతా శిశు ఆసుపత్రి పట్టణంలోనీ ఐబీ వద్ద నిర్మించేందుకు వైద్య ఆరోగ్య శాఖ నుండి అనుమతులు లభించాయని త్వరలోనే సర్క్యులర్ జారీ అవుతుందని తెలిపారు. విద్యుత్ వైర్లు కాలిపోవడం ప్రమాద వశాత్తూ జరిగిందా లేక గిట్టని వారు చేసారా అని కోణం లో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని, అలాగే సంబంధిత టెక్నిషియన్లు విధుల్లో. నిర్లక్ష్యం వహించిన వారి పైన విచారణ జరిపి బాధ్యులైన వారిని తగు చర్యలు చేపడతామని , మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అధికారులను హెచ్చరించారు...
Also Read : RajannaSircilla : బాబూ జగ్జీవన్ రాం జీవితం స్ఫూర్తిదాయకం
Admin
Studio18 News