Studio18 News - తెలంగాణ / : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక సాధనమైన చేనేత... నేటి తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధానంగా నిలిచిందని పేర్కొన్నారు. చేనేతకు పునరుజ్జీవనం కల్పించడానికి ప్రజాప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు. మహిళా శక్తి గ్రూప్‌లు, ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 'నిండైన భారతీయతకు నిజమైన అందాన్ని ఇచ్చే చేనేత వస్త్రాలను ధరిద్దాం. నేతన్నలకు ప్రోత్సాహాన్ని అందిద్దాం. నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.
Admin
Studio18 News