Saturday, 14 December 2024 04:06:22 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Telangana: పసలేని.. దిశలేని.. దండగమారి బడ్జెట్: తెలంగాణ బడ్జెట్‌పై కేటీఆర్

Date : 25 July 2024 06:11 PM Views : 83

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు అని విమర్శించారు. గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల.. ఎగవేతల బడ్జెట్ అన్నారు. వాగ్దానాలను గాలికొదిలిన.. వంచనల బడ్జెట్ అని పేర్కొన్నారు. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన... దోకేబాజ్ బడ్జెట్ అన్నారు. విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కత్తిరింపులు... అన్నదాతలకు సున్నం అని చురక అంటించారు. ఆడబిడ్డలకు అన్యాయం.. మహాలక్ష్ములకు మహామోసమని ధ్వజమెత్తారు. అవ్వాతాతలకు.. దివ్యాంగులకు.. నిరుపేదలకు... నిస్సహాయులకు మొండిచేయి చూపారని ఆరోపించారు. పెన్షన్ల పెంపు మాటెత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు దగా.. గిరిజనులకు మోసం.. అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు.. శూన్యహస్తమే మిగిలిందన్నారు. బడుగు.. బలహీన వర్గాలకు భరోసాలేదు.. వృత్తి కులాలపై కత్తికట్టారన్నారు. మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ నీటి మూటలయ్యాయని విమర్శించారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు.. 4 వేల భృతి జాడా పత్తా లేదని పేర్కొన్నారు. విద్యార్థులపై కూడా వివక్ష చూపారని ఆరోపించారు. 5 లక్షల భరోసా కార్డు ముచ్చటే లేదన్నారు. హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు.. మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్నకు చేయూత లేదు.. ఆటో అన్నలను అండదండ లేదన్నారు. ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమే లేదని విమర్శించారు. మొత్తంగా.. పసలేని.. దిశలేని.. దండగమారి బడ్జెట్ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :