Monday, 16 September 2024 06:38:23 PM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

Rythu runa Mafi : రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల.. మొదటి స్థానంలో నల్గొండ జిల్లా.. సీఎం రేవంత్ ఏమన్నారంటే

Date : 30 July 2024 03:18 PM Views : 30

Studio18 News - తెలంగాణ / : CM Revanth Reddy : రెండో విడత రైతు రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల లక్షలోపు రుణాలు కలిగిన రైతులకు రుణమాఫీ చేయగా.. ఇవాళ లక్షన్నర లోపు రుణాలుకలిగిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో రైతు రుణమాపీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో 11,34,421 మంది రైతులుకు రూ.6034.96 కోట్లు విడుదల చేసింది. రెండో విడతలో లక్షన్నర లోపు రుణాలు కలిగిన 6,40,223 మంది రైతులకు రూ. 6190.01 కోట్లు విడుదల చేసింది. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షలు రుణం కలిగిన 17,75,235 మంది రైతులకు 12,224.98 కోట్లు రుణమాఫీని ప్రభుత్వం చేయనుంది. రైతు రుణమాఫీలో భాగంగా రెండు విడతల్లో అత్యధిక రైతు రుణాలు ఉన్న జాబితాలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని అన్నారు. రుణమాఫీ చేసి చూపిస్తున్నాం. రైతుల ఇండ్లలో పండుగ జరుగుతుంది.. మా జన్మ ధన్యం అయ్యింది. ఈ కార్యక్రమం రాజకీయ ప్రయోజనం కాదు.. రైతు ప్రయోజనం. కార్పోరేట్ కంపెనీలు బ్యాంక్ లకు అప్పులు ఎగ్గొడుతున్నాయి.. దేశంలో 14లక్షల కోట్లు ఎగవేశాయి. రైతు పట్టెడు అన్నం పెట్టేందుకే వ్యవసాయం చేస్తున్నారు. పంట నష్టంతో అప్పులు చెల్లించలేక రైతులు కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదనే రెండు లక్షల రుణమాఫీ మాట ఇచ్చాం. కాంగ్రెస్ చేసిన రుణమాఫీ హామీని కొందరు అవహేళన చేశారని రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రైతును రుణగ్రస్తులను చేసింది. 31వేల కోట్ల రుణమాఫీ చేస్తామంటే కొందరు మమ్మల్ని శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వానికి నిధుల కష్టాలు ఉన్నా.. 6,198 కోట్లు రెండో విడత రుణమాఫీ చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదీ కాంగ్రెస్ పరిపాలన దక్షత. దేశంలో సాగునీటి ప్రాజెక్ట్ లను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. బ్యాంక్ జాతీయకరణతో పేదలకు బ్యాంక్ లను దగ్గర చేసింది ఇందిరాగాంధీ. రైతు రుణమాఫీ, రైతు బీమా, మద్దతు ధర చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు. మా ప్రణాళికలను ఎవరూ ప్రశ్నించలేరు. నెల తిరగక ముందే 18 లక్షల మంది రైతుల రుణమాఫీ చేసి చిత్తశుద్ధి చాటుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. జూలై, ఆగస్ట్ నెలలు రైతులకు చారిత్రకం. దేశంలో లోనే 31 వేల కోట్లు రుణమాఫీ చేసి తెలంగాణ రికార్డ్ సృష్టించింది. రైతులకు ఫుల్ టైం సెటిల్ మెంట్ చేసి రుణమాఫీ చేసి చూపిస్తున్నాం. గత సర్కార్ చేసిన అప్పులకు నెలకు 6 వేల కోట్లు మిత్తి చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు 43 వేల కోట్ల గత సర్కార్ చేసిన అప్పులను చెల్లించామని రేవంత్ తెలిపారు. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. గంటల సమయం కూడా వృథా చేయకూడ‌దనే నాడు ఇక్కడే ఉచిత బస్సు ఫ్రీ పథకాన్ని ప్రారంభించాం. రుణమాఫీ పై మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రెండో విడతలో 6.4 లక్షల అకౌంట్ లకు 6.190 కోట్లు రుణమాఫీ విడుదల చేసాం. సీఎం రేవంత్ .. ఇక్కడ చెక్ ఇవ్వగానే.. క్షణాల్లో ప్రతి రైతు అకౌంట్ లోకి రుణమాఫీ జమ అవుతాయి. రుణమాఫీ సాధ్యం కాదని ప్రతిపక్షాలు అన్నాయి. లక్ష రుణమాఫీని చేయలేక పోయింది గత ప్రభుత్వం. సంకల్ప బలంతో ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు మాట నిలబెట్టుకున్నాం. కొందరి అనుమానాలను పటాపంచలు చేసి.. రుణ‌మాఫీ చేసి చూపించాం. రైతు బీమా కుడా ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు నేడు పండుగ రోజు. 31వేల కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో లేదని భట్టి అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :